మృతదేహాల కోసం వినతి

మృతదేహాల కోసం వినతి

26-03-2017

మృతదేహాల కోసం వినతి

అమెరికాలో హత్యకు గురైన శశికళ, అనీష్‌ సాయి మృతదేహాలను ఆంధ్రప్రదేశలోని వారి బంధువులకు అప్పగించేందుకు సహకరించాలని అమెరికాలో భారతరాయబారి రివ గంగూలీదాస్‌కు ఏపీ భవన అదనపు కమిషనర్‌ డాక్టర్‌ అర్జా శ్రీకాంత లేఖ రాశారు.  కేసు విచారణ నిమిత్తం హనుమంతరావును అమెరికాపోలీసులు అదుపులోకి తీసుకున్నందున.. మృతదేహాల గురించి ఏపీలోని వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని, ప్రభుత్వ సహాయం కోరారనిపేర్కొన్నారు. న్యూజెర్సీ పోలీసులను సంప్రదించి మృతదేహాలను వారి బంధువులకు అప్పగించేందుకు సహకరించాలని కోరారు.