కేసును ఇండియాకు బదిలీ చేయాలి

కేసును ఇండియాకు బదిలీ చేయాలి

26-03-2017

కేసును ఇండియాకు బదిలీ చేయాలి

న్యూజెర్సీలో హత్యకు గురైన తల్లీబిడ్డలు శశికళ, అనీశ్‌ కేసు విచారణలో ఎలాంటి పురోగతి లేదు. హత్యకు దారితీసిన కారణాలను అన్వేషిస్తున్నామని పోలీసులు తెలిపారు. శశికళభర్త హనుమంతరావును పోలీసులు మరోసారి ప్రశ్నించారు. కాగా, తమ కుమార్తె, మనవడు హత్య కేసులో తమకు న్యాయం కావాలని శశికళ తల్లిదండ్రులు సుంకరవెంకటేశ్వరరావు, కృష్ణకుమారి డిమాండ్‌ చేశారు. శనివారం విజయవాడ పోరంకిలోని లక్ష్మీపురం గామ్రంలో వారు విలేకరులతో మాట్లాడారు.

‘‘మా అల్లుడికి మరో మహిళతోవివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం అతడి తల్లిదండ్రులకు తెలుసు. వాళ్ల ప్రోద్బలంతోనే మా అమ్మాయిని తరచుగా వేధించేవాడు. అమ్మాయిని, మనవడ్ని అతడే చంపేశాడు.కేసును తారుమారు చేయడానికి న్యూజెర్సీలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ మాకు న్యాయం జరగదు. మాకు న్యాయం జరగాలంటే కేసును ఇండియాకు బదిలీచేయాలి’’ అని వారు డిమాండ్‌ చేశా రు. కేసును ఇండియాకు బదిలీ చేయించడానికి కేంద్ర మంత్రులు సుష్మస్వరాజ్‌, వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు చొరవ తీసుకోవాలనికోరారు.