బే ఏరియాలో ధీం తానా పోటీలు ఏప్రిల్‌ 1న

బే ఏరియాలో ధీం తానా పోటీలు ఏప్రిల్‌ 1న

25-03-2017

బే ఏరియాలో ధీం తానా పోటీలు ఏప్రిల్‌ 1న

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మహాసభలను పురస్కరించుకుని వివిధ నగరాల్లో నిర్వహిస్తున్న ధీం తానా పోటీలను బే ఏరియాలో కూడా ఏర్పాటు చేశారు. ఏప్రిల్‌ 1వ తేదీన మిల్‌పిటాస్‌లోని ఇండియా కమ్యూనిటీ సెంటర్‌లో ఈ పోటీలు జరుగుతాయని తానా నాయకుడు సతీష్‌ వేమూరి తెలిపారు. సోలో సింగింగ్‌, గ్రూపు డ్యాన్సింగ్‌, మిస్‌ టీన్‌ తానా, మిస్‌ తానా, మిసెస్‌ తానా పోటీలను నిర్వహిస్తున్నామని, పోటీల్లో పాల్గొనేవారు రిజిస్ట్రేషన్‌ ఫీజుగా 25డాలర్లు చెల్లించాలని కోరారు. ఫైనల్స్‌ పోటీలు తానా మహాసభల్లో మే 26,27,28 తేదీల్లో జరుగుతాయని చెప్పారు. ఇతర వివరాలకు విజయ ఆసూరి 510 421 3535, వినయ్‌ పరుచూరి 510 579 7650, రజనీకాంత్‌ కాకర్ల 510 509 8748లో సంప్రదించవచ్చు.