నాట్స్ సంబరాలు ప్రారంభం

నాట్స్ సంబరాలు ప్రారంభం

01-07-2017

నాట్స్ సంబరాలు ప్రారంభం

చికాగోలో ఉత్తర అమెరికా తెలుగు సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. షాంబర్గ్‌లోని రినైసైన్స్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. శుక్రవారంనాడు విందు కార్యక్రమంతో అమెరికా తెలుగు సంబరాలకు శ్రీకారం చుట్టారు. అమెరికా నలుమూలల నుంచి ఇండియా నుంచి తెలుగువాళ్ళు హాజరయ్యారు. పలువురు ప్రముఖులు కూడా ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఇండియా నుంచి చికాగో చేరుకున్నారు. శని,ఆదివారాల్లో తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే కార్యక్రమాలను ప్రదర్శించనున్నట్లు కాన్ఫరెన్స్‌ కన్వీనర్‌ రవి ఆచంట, అధ్యక్షుడు మోహన్‌ కృష్ణ మన్నవ తెలిపారు.

నాట్స్‌ సేవా కార్యక్రమాలను బోర్డ్‌ చైర్మన్‌ శ్యాం మద్దాలి వివరించారు. నాట్స్‌ కార్యవర్గ సభ్యుడు శ్రీధర్‌ అప్పసాని తొలుత బోర్డ్‌ సభ్యులను అందరికీ పరిచయం చేశారు. నాట్స్‌ ప్రతినిధులు ముక్కామల అప్పారావు, మధు కొర్రపాటి, మాజీ రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, ఎపి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌, తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవంత్‌ రెడ్డి, సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఆనంద్‌ కూచిభొట్ల తదితరులు ఈ సంబరాలకు హాజరయ్యారు.


Click here for Event Gallery