సేంద్రియ సాగుకు ప్రోత్సాహం ఇవ్వండి...తానా సదస్సులో నాయకులు

సేంద్రియ సాగుకు ప్రోత్సాహం ఇవ్వండి...తానా సదస్సులో నాయకులు

02-06-2017

సేంద్రియ సాగుకు ప్రోత్సాహం ఇవ్వండి...తానా సదస్సులో నాయకులు

సెయింట్‌ లూయిస్‌లో ఇటీవల జరిగిన తానా 21వ మహాసభలో సదస్సులో వ్యవసాయ సాగుపై చర్చాకార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో  రైతు నేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ వై.వేంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. ప్రకృతి, సేంద్రియ సాగును ప్రోత్సహించేందుకు ఎన్నారైలు ముందుకురావాలని ఆయన కోరారు.

ప్రధానంగా సేంద్రియ ప్రకృతి వ్యవసాయ విధానాల ప్రోత్సాహం, ఉత్పత్తుల మార్కెటింగ్‌ విషయంలో తానా తన వంతు బాధ్యతగా తెలుగు రైతుల కృషిని,  శ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని కోరారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రసాయనరహిత, ప్రకృతి సాగును విజయవంతం చేసి, సాగును లాభసాటి చేసేందుకు తానా కూడా తనవంతు పాత్ర నిర్వహిస్తుందని వై.వేంకటేశ్వరరావు ఆశాభావం వ్యక్తం  చేశారు. ఇందులో భాగంగా గ్రామీణ యువతను సేంద్రియ వ్వవసాయం  దిశగా నడిపించేందుకు అవసరమైన శిక్షణ, అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిర్వహించడంలో భాగస్వామ్యం తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సేంద్రియ సాగులో తోడ్పాటునందించే విషయంలో తానాకు రైతునేస్తం ఫౌండేషన్‌ ఎల్లప్పుడూ తమ సహకారాన్ని అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.