తెలంగాణలో బోయింగ్‌ విస్తరణ : కేటీఆర్‌

తెలంగాణలో బోయింగ్‌ విస్తరణ : కేటీఆర్‌

28-01-2020

తెలంగాణలో బోయింగ్‌ విస్తరణ : కేటీఆర్‌

తెలంగాణ రాష్ట్రంలో తమ కార్యకలాపాలను మరింత విస్తృతపరుచనున్నట్టు బోయింగ్‌ సంస్థ వెల్లడించింది. ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌తో భేటీ అయిన సందర్భంగా బోయింగ్‌ చైర్మన్‌ మిచేల్‌ ఆర్థర్‌ ఈ విషయం తెలిపారు. రాష్ట్రంలో బోయింగ్‌ సంస్థ నిర్వహిస్తున్న అపాచి, చినోక్‌ హెలికాఫ్టర్ల తయారీపై చర్చించారు. రాష్ట్రంలో ఏరోస్సేస్‌ రంగానికి మంచి అవకాశాలున్నాయని, ఇక్కడ ఎకో సిస్టం బాగుందని మంత్రి కేటీఆర్‌ వివరించారు. టీఎస్‌ఐపాస్‌ పారిశ్రామిక విధానం ప్రపంచ దేశాల గుర్తింపు పొందిందన్నారు. ప్రముఖ ప్రముఖ ఏరోస్సేస్‌ సంస్థలు పెట్టుబడులు పెట్టేలా తెలంగాణ ఆకర్షించిందని, ప్రపంచంలోని అగ్రశేణి ఐదు ఐటీ సంస్థలు గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌, సేల్స్‌ఫోర్స్‌ తమ రెండో అతిపెద్ద కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేశాయని చెప్పారు.

తెలంగాణలో ప్రపంచస్థాయి ఏరోస్సేస్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలనుకొంటున్నామని, దీని ఏర్పాటులో భాగస్వామ్యం కావాలని బోయింగ్‌ సంస్థను మంత్రి కేటీఆర్‌ ఆహ్వానించారు. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌, బోయింగ్‌ ఇండియా చైర్మన్‌ సలిల్‌ గుప్తే, ఇండియా ఎండీ సురేంద్ర అహుజా పాల్గొన్నారు.