తానా ఇమ్మిగ్రేషన్‌ కాన్ఫరెన్స్‌ కాల్‌ ఫిబ్రవరి 2న

తానా ఇమ్మిగ్రేషన్‌ కాన్ఫరెన్స్‌ కాల్‌ ఫిబ్రవరి 2న

28-01-2020

తానా ఇమ్మిగ్రేషన్‌ కాన్ఫరెన్స్‌ కాల్‌ ఫిబ్రవరి 2న

ఉత్తర అమెరికా తెలుగు సంఘం కమ్యూనిటికోసం ఇమ్మిగ్రేషన్‌ కాన్ఫరెన్స్‌ కాల్‌ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ప్రముఖ ఇమ్మిగ్రేషన్‌ అటార్నీలతో మీ సందేహాలను ఈ కార్యక్రమం ద్వారా తెలియజేసి సమాధానాలను తెలుసుకోవచ్చు. ఫిబ్రవరి 2వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు ఈ కాన్ఫరెన్స్‌ కాల్‌ కార్యక్రమం జరుగుతుంది. 720-820-1476 (Once the Conference call starts you need to press *6 to ask your questions) ఫోన్‌ చేసి ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించిన విషయాలను తెలుసుకోవచ్చు. సెనెట్‌ 386 బిల్‌ (కంట్రీ కోటాను ఎత్తివేసే బిల్లు), ఎఫ్‌1 స్టూడెంట్స్‌ వీసాలో సాధారణంగా చేసే తప్పులు, హెచ్‌1బి లాటరీ రిజిస్ట్రేషన్‌, డే 1 సిపిటి మాయాజాలం వంటి విషయాలపై ఇందులో తెలుసుకోవచ్చు. ఇమ్మిగ్రేషన్‌ లాయర్లు రాహుల్‌ రెడ్డి, రెబెక్కా చెన్‌ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తానా నాయకులు మురళీ తాళ్ళూరి, కుమార్‌ పిచికల తెలిపారు.