నార్త్‬ అమెరికా లో అమరావతి గళం

నార్త్‬ అమెరికా లో అమరావతి గళం

28-01-2020

నార్త్‬ అమెరికా లో అమరావతి గళం

రాజధాని అమరావతి కి మద్దతుగా నార్త్ అమెరికాలోని వివిధ నగరలలో ప్రవాసాంధ్రులు నిరసన వ్యక్తం చేశారు. అమరావతి నుంచి రాజధాని ని విశాఖపట్నంకి తన స్వార్ధ ప్రయోజనాల కోసం అడ్డంగా తరలించాలని చూస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుట్రకు వ్యతిరేకంగా ప్రవాసాంధ్రులు ఒక తాటి మీదకు వచ్చి నార్త్ అమెరికా లో దాదాపు 25 నగరాలల లో #SaveAmaravati, #SaveAmaravatiFarmers, #SaveAndhraPradesh అనే నినాదం తో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం బేఆరియా, అట్లాంటా, హూస్టన్, షార్లెట్, మిన్నియాపాలిస్, టొరంటో, ఒమాహా, ఫిలడెల్ఫియా, కాన్సాస్ సిటీ, డెస్ మోయిన్స్, పోర్ట్ ల్యాండ్, కిచెనర్, చికాగో, విల్మింగ్టన్, ఆస్టిన్, ఎడిసన్, డెట్రాయిట్, వాషింగ్టన్ డీసీ, అష్బర్న్, బోస్టన్, రాలే, హార్ట్ఫోర్డ్, సెయింట్ లూయిస్, అరోరా నగరాల్లో నిర్వహించారు.