దావోస్‌లో ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

దావోస్‌లో ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

23-01-2020

దావోస్‌లో ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దావోస్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా కూడా భారత్‌లాగే అభివృద్ధి చెందుతున్న దేశమని అన్నారు. భారత్‌కు మాత్రమే అభివృద్ధి చెందుతున్న దేశమనే ముద్ర ఉందని, అభివృద్ధి చెందుతున్న దేశంగా ముద్రపడటంతో భారత్‌కు మేలు జరుగుతోందని ట్రంప్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. 20 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికాకు, ట్రంప్‌ కొత్త నిర్వచనం చెప్పడం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రపంచ ఆర్థిక సమాఖ్య (డబ్ల్యూఈఎఫ్‌) వార్షిక సమావేశంలో వివిధ నేతలతో పాటు ట్రంప్‌ కూడా పాల్గొన్నారు.