గర్భిణులకు అమెరికా వీసా ఆంక్షలు!

గర్భిణులకు అమెరికా వీసా ఆంక్షలు!

23-01-2020

గర్భిణులకు అమెరికా వీసా ఆంక్షలు!

విదేశాల నుంచి అమెరికాకు వెళ్లిన గర్భిణులు అక్కడే ప్రసవిస్తే తమ పిల్లలకు అమెరికా పౌరసత్వం దొరుకుతుందని ఇక ఆశించే రోజులు రాకపోవచ్చు. గర్భిణులకు ట్రంప్‌ ప్రభుత్వం కొత్త వీసా ఆంక్షలు విధించనుండడమే ఇందుకు కారణం. కొత్త నిబంధనల ముసాయిదాను వెల్లడిస్తామని పేర్లు చెప్పడానికి ఇష్టపడని అధికారులు తెలిపారు. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే.. గర్భిణులు తమ టూరిస్ట్‌ వీసాపై అమెరికా వెళ్లడం మరింత కఠినమవుతుంది. అయితే ఈ నిబంధనలు అమలు చేయడం ట్రంప్‌ ప్రభుత్వానికి అంత సులభం కాదని నిపుణులు, ట్రంప్‌ ప్రభుత్వంలోని కొంతమంది అధికారులూ చెబుతున్నారు.