శాండర్స్‌ను సమర్ధించబోనన్న హిల్లరీ క్లింటన్‌

శాండర్స్‌ను సమర్ధించబోనన్న హిల్లరీ క్లింటన్‌

23-01-2020

శాండర్స్‌ను సమర్ధించబోనన్న హిల్లరీ క్లింటన్‌

ఈ ఏడాది చివర జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తాను డెమొక్రాటిక్‌ అభ్యర్థిగా సెనేటర్‌ బెర్నీ శాండర్స్‌ను సమర్ధించబోనని మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ చెప్పారు. శాండర్స్‌ తన స్వశక్తితోనే డెమొక్రాట్‌ అభ్యర్థిత్వాన్ని సాధించాల్సి వుంటుందని ఆమె అన్నారు. ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ శాండర్స్‌ను ఎవరూ ఇష్టపడరని, ఎవరూ ఆయనతో కలిసి పనిచేయాలని కోరుకోరని వ్యాఖ్యానించారు. శాండర్స్‌ ఒక కెరీర్‌ పొలిటీషియన్‌ అని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలను మీరు కట్టుబడి వుంటారా? అన్న ప్రశ్నకు తప్పకుండా అని ఆమె బదులిచ్చారు.