అమెరికాతో తాలిబన్‌ శాంతి ఒప్పందం!

అమెరికాతో తాలిబన్‌ శాంతి ఒప్పందం!

21-01-2020

అమెరికాతో తాలిబన్‌ శాంతి ఒప్పందం!

జనవరి చివరి నాటికి అమెరికాతో కాల్పుల ఉపసంహరణ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని తాలిబన్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు తమ సైనిక కార్యకలాపాలను తగ్గించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తాలిబన్‌ ప్రధాన ప్రతినిధి తెలిపినట్టు సమాచారం. తాజాగా దోహా వేదికగా తాలిబన్‌, అమెరికా మధ్య చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే వారు కొద్దిరోజుల పాటు కాల్పుల విరమణకు ముందుకొచ్చినట్టు సృష్టం చేశారు. సుదీర్ఘ కాలంగా తాలిబన్లతో అమెరికా శాంతి చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. గత సెప్టెంబర్‌లో అర్థంతరంగా చర్చలు ముగించిన అధ్యక్షుడు ట్రంప్‌ ఇటీవలే పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించారు.