మున్సిపల్‌ ఎన్నికల్లో ఎన్‌ఆర్‌ఐల ఇంటింటి ప్రచారం...

మున్సిపల్‌ ఎన్నికల్లో ఎన్‌ఆర్‌ఐల ఇంటింటి ప్రచారం...

21-01-2020

మున్సిపల్‌ ఎన్నికల్లో ఎన్‌ఆర్‌ఐల ఇంటింటి ప్రచారం...

మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వర్థన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నూనావత్‌ ఉషకు మద్దతుగా టీఆర్‌ఎస్‌ యూకె ఎన్‌ఆర్‌ఐ విభాగం ప్రచారం నిర్వహించింది. ఈ ప్రచారంలో టీఆర్‌ఎస్‌ యుకె విభాగం ప్రధానకార్యదర్శి కడుదుల రత్నాకర్‌, కార్యదర్శి వినయ్‌ ఆకుల, అధికార ప్రతినిధి రాజ్‌కుమార్‌ శానబోయిన, తెలంగాణ జాగృతి యువత అధ్యక్షుడు కోరబోయిన విజయ్‌ ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా ఎన్‌ఆర్‌ఐ యుకె ప్రతినిధులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో వర్థన్నపేట శాసనసభ్యుడు అరూరి రమేష్‌ నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటువేసి టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.