తానా ఫౌండేషన్‌ సేవల విస్తరణకు కృషి - శ్రీనాథ్‌ కుర్రా

తానా ఫౌండేషన్‌ సేవల విస్తరణకు కృషి - శ్రీనాథ్‌ కుర్రా

21-01-2020

తానా ఫౌండేషన్‌ సేవల విస్తరణకు కృషి - శ్రీనాథ్‌ కుర్రా

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) కమ్యూనిటీ సేవా కార్యక్రమాలను తానా ఫౌండేషన్‌ తరపున చేస్తున్న సంగతి తెలిసిందే. అమెరికాలోనూ, ఇండియాలోనూ తానా ఫౌండేషన్‌ తరపున వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా ఇండియాలో ఫౌండేషన్‌ ట్రస్టీగా హైదరాబాద్‌కు చెందిన అలేఖ్య హోమ్స్‌ అధినేత కుర్రా శ్రీనాథ్‌ను నియమించినట్లు తానా ఫౌండేషన్‌ చైర్మన్‌ నిరంజన్‌ శృంగవరపు తెలిపారు.

తెలుగు రాష్ట్రాలలో, ఇండియాలో తానా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించే సేవా కార్యక్రమాలకు శ్రీనాధ్‌ ట్రస్టీ హోదాలో సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. ఇటీవల అమెరికాతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలల్లో తానా నిర్వహించిన ''అమ్మ-నానా-గురువు'' శతక పద్య పదార్చన కార్యక్రమంలో శ్రీనాథ్‌ కీలకపాత్ర పోషించారు. తెలుగుటైమ్స్‌తో శ్రీనాథ్‌ మాట్లాడుతూ, తానా ఫౌండేషన్‌ సేవల విస్తరణలో అందరి సలహాలను తీసుకుంటానని, ఈ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు తనవంతుగా కృషి చేస్తానని చెప్పారు.