అత్యద్భుతంగా అట్లాంటా తెలుగు సంఘం తామా సంక్రాంతి సంబరాలు

అత్యద్భుతంగా అట్లాంటా తెలుగు సంఘం తామా సంక్రాంతి సంబరాలు

21-01-2020

అత్యద్భుతంగా అట్లాంటా తెలుగు సంఘం తామా సంక్రాంతి సంబరాలు

అట్లాంటా నార్క్రాస్ హై స్కూల్లో జనవరి 18న తామా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా) సంక్రాంతి సంబరాలు అత్యద్భుతంగా జరిగాయి. శూరా ఇన్వెస్టుమెంట్స్, సంక్రాంతి రెస్టారెంట్, మాగ్నమ్ ఓపస్ ఐటీ, మై టాక్స్ ఫైలర్ వారు సంయుక్తంగా సమర్పించిన ఈ వేడుకలలో 1450 మందికి పైగా నగరవాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలలో 60 మందికి పైగా మహిళలు విభిన్న ముగ్గులు వేసి అలరించారు. పిల్లలకు ప్రత్యేకంగా నిర్వహించిన గ్లోబల్ ఆర్ట్ కళ మరియు ది యంగ్ లీడర్స్ అకాడమీ ఉపన్యాసం పోటీలలో సుమారు 240 మంది తమ ప్రతిభా పాటవాలు చాటారు. గెలిచిన వారికి  బహుమతులు అందజేశారు.

సాంఘిక సేవా కార్యదర్శి సాయిరామ్ కారుమంచి ప్రారంభ ఉపన్యాసం చేస్తూ, అందరినీ ఉత్సవాలకు ఆహ్వానించి, వివిధ కార్యక్రమాల వివరాలు అందజేశారు. తామా కార్యవర్గ మరియు బోర్డు సభ్యులను వేదిక మీదకు పిలిచి వారిచే జ్యోతి ప్రజ్వలన గావించారు. తదుపరి ముఖ్య అతిథి లోహిత్ కుమార్ తమాషా విషయాలతో, మిమిక్రీతో సాంస్కృతిక కార్యక్రమాలలో కళాకారులతో పాటు ప్రేక్షలులనూ భాగం చేశారు. తామా చేసే వివిధ కార్యక్రమాలు, వైద్యం, విద్య, వికాసం, వినోదం, విజ్ఞానం, సేవ, సదస్సులు, సాహిత్యం, సహాయం, సాంస్కృతిక మరియు ఆటపాటల గురించి వివరించారు. అట్లాంటావాసులు భక్తి గేయాలు, పద్యాలు, టాలీవుడ్ మెడ్లీలు, నాటికలు, సినిమా పాటలు, కూచిపూడి నృత్యాలు, బ్రేక్ డాన్సులు కన్నుల మరియు వీనుల విందుగా చేసి ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశారు. వారందరికీ సాంస్కృతిక కార్యదర్శి రూపేంద్ర వేములపల్లి ప్రశంసాపత్రాలను బహుకరించారు.

అధ్యక్షుడు భరత్ మద్దినేని, బోర్డు ఛైర్మన్ రాజశేఖర్ చుండూరి తామా నూతన సభ్యులను సభకు పరిచయం చేసి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. భరత్ విచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, తెలుగు వారికి తోడ్పాటు, తామా చరిత్ర మున్నగు విషయాలను విశదీకరించారు. రాజశేఖర్ తామా కార్యక్రమాలు, ఉచిత క్లినిక్, మనబడి, వివిధ సదస్సులు, స్కాలర్షిప్స్, ఇటీవల తామాకు లభించిన అమెరికా ప్రెసిడెంట్ వాలంటీర్ ఎలిజిబిలిటీ గురించి విపులీకరించారు.

ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్ శూరా ఇన్వెస్టుమెంట్స్, సంక్రాంతి రెస్టారెంట్, మాగ్నమ్ ఓపస్ ఐటీ, మై టాక్స్ ఫైలర్ సంస్థల గురించి తామా టీం వివరించి, అందరికీ వారు ఎలా ఉపయోగపడతారో  చెప్పారు. ఉత్సవానికి విచ్చేసిన హరిప్రసాద్ సాలియన్ని మరియు సురేష్ ధూళిపూడిని స్టేజి మీదకు ఆహ్వానించి ఘనంగా సత్కరించారు  ఈ సందర్భంగా వారు తమ సంస్థల కార్యకలాపాలను, తామాతో వారి అనుబంధాన్ని గుర్తు చేసుకొని, తామా చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు.

టాలీవుడ్ గాయనీగాయకులు దామిని, ధనుంజయ్ తమ పాటలతో, ఆటలతో, సరదా మాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. పిల్లలు మరియు పెద్దలు డ్యాన్సు చేయడం ఒక విశేషం. అతిధులు ప్రేక్షకుల మధ్యకు వెళ్లి మరీ వారిచే డ్యాన్సులు  చేయించడం కొసమెరూపు. ముఖ్య అతిధులు ముగ్గురినీ తామా టీం ప్రశంసించి, సత్కరించారు.

తామా ‘గో గ్రీన్’ లో భాగంగా ఎకో ఫ్రెండ్లీ ప్లేట్లు, స్పూన్లు, వాటర్ స్టేషన్స్ వాడటం, ప్లాస్టిక్ అస్సలు వాడకపోవడం ఒక కలికితురాయి. మహిళలు.పిల్లలు ఉచిత మెహందీ మరియు రకరాల షాపింగ్ స్టాల్స్ దగ్గర తిరుగుతూ కనిపించారు. ఏర్పాట్లు చక్కగా ఉన్నాయనీ, ఈ కార్యక్రమం ఇంకాసేపు ఉంటే బాగుండేదని, స్టేజ్ అలంకరణ సినిమా సెట్టింగులా ఉందని, ఫోటో బూత్ సాంప్రదాయకరంగా ఉందని, సంక్రాంతి రెస్టారెంట్ వారు అందించిన రుచికరమైన వంటకాలు, అరిసెలు షడ్రసోపేతంగా ఉన్నాయని పలువురు ప్రశంసించారు. అంత పెద్ద స్కూల్ లో పార్కింగ్ దొరకటం కొంచం కష్టం కావడం, ఆఖరి దాకా హాలు నిండి ఉండడం ఈ కార్యక్రమం ఎలా జరిగిందో  తెలియజేస్తుంది. 

చివరగా కనీవినీ ఎరుగని రీతిలో సంక్రాంతి సంబరాలని విజయవంతం చేసిన అట్లాంటా ప్రజలకి, స్పాన్సర్స్ కి, ముఖ్య అతిధులకి, స్కూల్ యాజమాన్యానికి, వీడియో, స్టేజ్ సేవలందించిన బైట్ గ్రాఫ్ కి, ఫోటోగ్రఫీ రవికుమార్ వడ్డమానుకి, నిరంజన్ కి, టివీ5 ప్రవీణ్ పురం కి, పాల్గొన్న అట్లాంటా మ్యూజిక్ మరియు డ్యాన్స్ స్కూల్స్ కి, ముగ్గుల మరియు  రాఫుల్ స్పాన్సర్స్ కి, అలంకరణ చేసిన లక్కీ ఛార్మ్స్ కి, కళాకారులకి, వాలంటీర్స్ వినయ్ గోపిశెట్టి, శ్రీనివాస్ లావు, రమేష్ పాలెం, ఉదయ్ కంభంపాటి, ప్రియా బలుసు, సుబ్బారావు మద్దాళి, రాజ్ కిరణ్ మూట, స్రవంతి కోవెల, వెంకట్ తోట, రవి యేలిశెట్టి, సురేష్ ధూళిపూడి, అంజయ్య లావు, అనిల్ ఎలమంచిలి, మురళి బొడ్డు, మల్లిక్ మేదరమెట్ల, వెంకీ గద్దె, హర్ష యెర్నేని, శ్రీని పెద్ది, రామ్ మద్ది, గౌరి కారుమంచి, నరేష్ ఎల్కోటి, శ్రీధర్ పాలడుగు, తేజ వేమూరి, ఉదయ కంభంపాటి, మహేష్ కొప్పు, రమేష్ మేడ, సునీల్ కాంత్ దేవరపల్లి, వినయ్ మద్దినేని, మహి నిమ్మగడ్డ, రీమా బొడ్డు, రోమిత్ చుండూరి, అనీష్ రుద్రరాజులకు సభాముఖంగా తామా ఉపాధ్యక్షులు ఇన్నయ్య ఎనుముల తామా టీం తరఫున ధన్యవాదాలు తెలిపి సంక్రాంతి ఉత్సవాలను దిగ్విజయంగా ముగించారు. 

Click here for Event Gallery