ఇరాన్‌కు మరోసారి వార్నింగ్‌ ఇచ్చిన ట్రంప్‌

ఇరాన్‌కు మరోసారి వార్నింగ్‌ ఇచ్చిన ట్రంప్‌

20-01-2020

ఇరాన్‌కు మరోసారి వార్నింగ్‌ ఇచ్చిన ట్రంప్‌

అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రికత్తలు మరోసారి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమైనీని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం. ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ, అమెరికన్లపై వారి ఆస్తులపై దాడులు చేస్తే చాలా తీవ్రంగా ప్రతిదాడులు చేస్తామని ట్రంప్‌ హెచ్చరించారు. ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ కూలిపోతోందని, ఆ దేశ ప్రజలు చాలా కష్టాలు అనుభవిస్తున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఖమైనీ జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని సూచించారు. ఉగ్రవాదాన్ని వదిలేసి ఇరాన్‌ను గొప్ప దేశంగా మార్చడంపై దృష్టి పెట్టాలని సూచించారు.