హైదరాబాద్‌లో అమెరికన్‌ క్రీడా విశ్వవిద్యాలయం!

హైదరాబాద్‌లో అమెరికన్‌ క్రీడా విశ్వవిద్యాలయం!

20-01-2020

హైదరాబాద్‌లో అమెరికన్‌ క్రీడా విశ్వవిద్యాలయం!

క్రీడారంగానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో హైదరాబాద్‌లో అతి పెద్ద క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు అమెరికన్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ప్రతినిధి బృందం ఇటీవల రాష్ట్రంలో పర్యటించింది. వర్సిటీ ప్రెసిడెంట్‌ రోసండిక్‌ డైక్‌ నేతృత్వం లోని ఈ బృందం స్టోర్ట్స్‌ ఆసియా చైర్మన్‌ నాగేంద్ర పులుమాటి, మంత్రి కేటీఆర్‌, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌ను కలిసింది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే హైదరాబాద్‌లో స్టోర్స్‌ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉన్నామని బృందం వివరించించింది. ఇప్పటికే అన్ని హంగులతో ఉన్న గచ్చిబౌలి స్టేడియం ఎంతో ఉపయోగపడుతుందని, దానిని అప్పగించేందుకు సర్కారు ప్రతిపాదించిందని వినోద్‌ చెప్పారు. పీపీపీ పద్ధతిలో లేదా లీజుకు గచ్చిబౌలి స్టేడియాన్ని అప్పగించేందుకు సముఖంగా ఉందని సర్కారు వారికి వివరించిందన్నారు.