చరిత్ర సృష్టించిన వాట్సాప్‌

చరిత్ర సృష్టించిన వాట్సాప్‌

20-01-2020

చరిత్ర సృష్టించిన వాట్సాప్‌

దిగ్గజ మెసేజింగ్‌ ప్లాట్‌ఫాం వాట్సాప్‌ ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల డౌన్‌లోడ్లను సాధించింది. ఈ ఘనత సాధించిన రెండో గూగుల్‌యేతర యాప్‌గా చరిత్ర సృష్టించింది. అయితే ఇది కేవలం ప్లేస్టోర్‌ నుంచి చేసుకున్న డౌన్‌లోడ్లు మాత్రమే గాక, వివిధ సంస్థలకు చెందిన మొబైల్‌ ఫోన్లలో ప్రీఇన్‌స్టాల్‌గా వచ్చే వాటితో కలిపి ఈ ఘనత సాధించింది. వాట్సాప్‌కు నెలకు 160 కోట్ల మంది యాక్టివ్‌ యూజర్లు ఉన్నారు. ఫేస్‌బుక్‌కు 130 కోట్ల మంది, వియ్‌చాట్‌కు 110 కోట్ల మంది యాక్టివ్‌ యూజర్లు ఉన్నారు. సోషల్‌ నెట్‌వర్క్‌లలో ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ల తర్వాత వాట్సాప్‌ మూడో స్థానంలో నిలిచింది. గతేడాదిలో గూగుల్‌ 230 కోట్ల డౌన్‌లోడ్లను సాధించగా, ఫేస్‌బుక్‌ 300 కోట్ల డౌన్‌లోడ్‌లను సాధించింది. మరోవైపు టిక్‌టాక్‌ యాప్‌ 2019లో రెండో అత్యధిక డౌన్‌లోడ్‌లు సాధించిన యాప్‌గా నిలిచింది.