ఫిబ్రవరి 7న యూఏఈలో శ్రీనివాస కళ్యాణం

ఫిబ్రవరి 7న యూఏఈలో శ్రీనివాస కళ్యాణం

18-01-2020

ఫిబ్రవరి 7న యూఏఈలో శ్రీనివాస కళ్యాణం

తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవం యూఏఈలోని అజ్మాన్‌లో ఫిబ్రవరి 7న ఘనంగా నిర్వహించనున్నట్లు ఐఎఎస్‌ రిటైర్డ్‌ అధికారి, టీటీడీ మాజీ జెఈవో లక్ష్మీకాంతం పేర్కొన్నారు. దేశంలోనే కాక ఇతర దేశాల్లోనూ శ్రీవారికి కోట్లాది మంది భక్తులు ఉన్నారని, ఈ నేపథ్యంలో సాంప్రదాయ అనే సంస్థ ద్వారా యూఏఈ లోనూ అజ్మాన్‌లో శ్రీనివాస కళ్యాణోత్సవ వైభవాన్ని భక్తులకు కనువిందుగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. భక్తులకు ఉచితంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, అజ్మాన్‌లోని ఇండియన్‌ అసోసియేషన్‌ హాలులో ఉదయం నుంచి సాయంత్రం వరకు సంప్రదాయబద్దమైన అర్చక స్వాములచే ఆగమశాస్త్ర ప్రకారం ఫిబ్రవరి 7న ఈ కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు లక్ష్మీకాంతం పేర్కొన్నారు.