తెలుగు రాష్ట్రాల్లో నాటా సేవలు

తెలుగు రాష్ట్రాల్లో నాటా సేవలు

20-12-2019

తెలుగు రాష్ట్రాల్లో నాటా సేవలు

తెలంగాణ  ఆంధ్రప్రదేశ్‌ తెలుగు రాష్ట్రాల్లో నాటా సేవలు  అందించడానికి అమెరికా నుంచి వచ్చిన బృంధంగా వచ్చామని నార్త్‌ అమెరికా తెలుగు అసోసియేషన్‌ ఆధ్యక్షుడు రాఘవరెడ్డి అన్నారు. నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్థానిక సర్పంచ్‌ బోగ ధరణి ఆనంద్‌ అధ్యక్షతన సమావేశం జరిగింది. మేము సైతం అంటూ అమెరికా నుంచి తాము పెరిగిన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నామని..... అన్నారు.

స్థానిక ఉత్తర అమెరికా తెలుగు మహిళా సంఘం అధ్యక్షురాలు ఉషారాణి చింత వీరు మోర్తాడ్‌ గ్రామానికి చెందిన వారు కావడం వల్ల తమ పర్యటన మోర్తాడ్‌ నుంచి మొదలుపెట్టడం సంతోషంగా ఉందన్నారు. తమ అసోసియేషన్‌ అమెరికాలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామని, తెలుగు రాష్ట్రాల్లో తాము జన్మించిన గడ్డపై సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రొగ్రాం ఏర్పాటు చేసుకున్నామన్నారు. ముఖ్యంగా పాఠశాలల్లో వసతులకు కల్పించడం పేదలకు సాయం చేయడం తదితర కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. రెండు రాష్ట్రాల్లో సుమారు కోటి రూపాయల వరకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని రాఘవరెడ్డి అన్నారు. నాటా సభ్యులు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అమెరికాలో నాటా ఏర్పాటు చేయడంలో ప్రత్యేక కృషి చేశామన్నారు. అమెరికా లో ఉషచింత ఆధ్వర్యంలో పలు మహిళ కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఈ సందర్భంగా ఉషా చింత మాట్లాడుతూ తాను చదువు కున్న పాఠశాలలో విద్యార్థులకు ఉపయోగపడే మంచినీటి సౌకర్యం కల్పించేందుకు బోరు, మోటారు ఏర్పాటు చేయించేందుకు అధ్యక్షుడు రాఘవరెడ్డిని కోరడంతో తాను సంతోషంగా ఒప్పుకున్నారన్నారు. 

ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పాఠశాలలో రాఘవరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఉషాచింత పూజా కార్యక్రమాలు నిర్వహించి బోరు వేసేందుకు ప్రారంభించారు. అనంతరం ముఖ్య అతిథులుకు శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రదానోపాధ్యయులు బాల చందర్‌, రిటైర్డు ఎంఈవో నందగిరి సత్యనారాయణ; మనోహర్‌లు, ప్రసంగిస్తూ నాట ప్రతీనిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ రణవీర్‌, వైసీ గంగారెడ్డి, బోగ ఆనంద్‌, దండు గంగాధర్‌ పాల్గొన్నారు.

Click here for Event Gallery