అమెరికా మరో సంచలన నిర్ణయం

అమెరికా మరో సంచలన నిర్ణయం

08-11-2019

అమెరికా మరో సంచలన నిర్ణయం

ఇప్పటికే హెచ్‌1 బీ వీసాల జారీ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న అగ్రరాజ్యం అమెరికా తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. యూఎస్‌ తన సవరించిన ఎంపిక ప్రక్రియలో భాగంగా హెచ్‌1 బీ వీసా దరఖాస్తు రుసుమును పది డాలర్లు పెంచింది. పిటిషనర్లు, ఫెడరల్‌ ఏజెన్సీ రెండింటికీ హెచ్‌-1 బీ క్యాప్‌ ఎంపిక ప్రక్రియను మరింత సమర్థవంతంగా చేయడానికి ఈ నాన్‌ రిఫండబుల్‌ రుసుము తోడ్పడుతుందని యూఎస్‌ పౌరసత్వం, ఇమిగ్రేషన్‌ సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్‌) పేర్కొంది. ఈ ప్రయత్నం హెచ్‌1-బీ క్యాప్‌ ఎంపిక ప్రక్రియను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి సహాయపడుతుందని యూఎస్‌సీఐఎస్‌ ఇంచార్జీ డైరెక్టర్‌ కెన్‌ కుసినెల్లి తెలిపారు. ఇక హెచ్‌1 బీ క్యాప్‌ ఎంపిక ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు కొత్త ఎలక్ట్రానిక్‌ రిజిస్ట్రేషన్‌ విధానాన్ని అవలంభిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి కూడా పెంచిన రుసుము ఉపయోగకరంగా ఉంటుందని కెన్‌ పేర్కొన్నారు.