ఒక్కసారి స్వ’గతం’ లోకి !!! -వాసిలి శ్యాం సుందర్

ఒక్కసారి స్వ’గతం’ లోకి !!! -వాసిలి శ్యాం సుందర్

07-11-2019

ఒక్కసారి స్వ’గతం’ లోకి !!! -వాసిలి శ్యాం సుందర్

(నాన్నగారు 'శార్వరి' 90 సంవత్సరాల జయంతి ఉత్సవ సందర్భంగా ఒక్క తియ్యని జ్ఞాపకం)

ఒక్కసారి అలా కాలచక్రంలో వెనక్కి వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది ? ఒక్క యాభై సంవత్సరాలు వెన్నక్కు వెళ్ళిపోతే !!! అబ్బా ఎంత బాగుంటుందో !!!! ఏమీ తెలియని వయస్సు, ఏమీ బాధ్యతలు లేని బాల్యం, ఎందుకు చదువుకోవాలో తెలియదు ఎందుకు స్కూల్కి వెళ్తున్నామో అసలే తెలియదు, చదువు కుంటే ఏమొస్తుందో అసలు ఆలోచించే ఇంగితం కూడా లేని బాల్యం. అమ్మానాన్నలు స్కూల్కి వెళ్లమంటున్నారు కాబ్బట్టి వెళ్లడం, చదువుకోమంటారు కాబట్టి చదువుకోవడం. ఎంతసేపటికి అన్నాతమ్ముళ్లతో, చెల్లెళ్ళతో, చుట్టూవున్న స్నేహితులతో ఆటలు, సరదాగా కాలక్షేపం చేసెయ్యటం. అమ్మానాన్నల ఎదుట చదువుకుంటున్నట్లు నటించటం. నాన్నగారు వస్త్తున్నట్లుగా రోడ్డు చివరనుంచి చూసి గబగబా పుస్తకాలూ తీసి ఎప్ప్పట్నుంచో చదువుతున్నట్లు నటించడం. అబ్బా ఎన్ని తియ్యని జ్ఞాపకాలు. ఇలా ఆలోచిస్తూపోతే ఎన్నో, ఎన్నెన్నో !!!

మరి ఇన్ని వేషాలు వేస్తోంటే అవి అమ్మకి నాన్నకి తెలియవా ? ఎందుకు తెలియవు. పిల్లి కళ్ళుమూసుకొని పాలు తాగుతూ ఎవరు చూడటం లేదు అనుకొంటుంది. అలాగే పిల్లలుగూడా వారు చేసే ఘనకార్యాలు ఎవరికీ తెలియవనుకుంటారు. ప్రతి తలితండ్రికి వాళ్ళ పిల్లల మనస్తత్వం, నడవడిక, ఇష్టాయిష్టాలు, పిల్లలు చేసే నాటకాలు అన్నీ తెలియకనే తెలుస్తాయి. కానీ ఆ వయసులో మనం అమ్మకి నాన్నకి తెలియదనే ఒక్క అపోహలో ఇటువంటి పనులు ఎన్నో చేసేస్తాం.

మరి ఇన్ని వేషాలు వేస్త్తున్నా, ఇంత నటిస్తున్నా అమ్మానాన్నలు ఏమీ తెలియనట్లు, చూడనట్లు ఎందుకు వుంటారు ? ఎందుకంటే వాళ్ళు అమ్మానాన్నలు కాబట్టి. పిల్లలు ఏమిచేసినా వాళ్లకు బాగానే ఉంటుంది. అది భరించే శక్తీ, సహనం వాళ్లకు పిల్లలతో పాటు కానుకగా వచ్చేస్తుంది. ఒకటి కొంటె ఇంకొకటి ఉచితంగా వచ్చినట్లే.

ఇవన్నీ ఎందుకు నెమరువేసుకోవలసి వచ్చిందంటే మొదట మా అమ్మానాన్నలకు మేము ఐదుగురం పిల్లలం, కాలాంతరంలో నలుగురం. మా అమ్మానాన్నలతో మా జీవితం, వారి ప్రేమ, అనురాగాలు, మాకు తెలియకుండానే మేము ఒక్కొక్కరం విడివిడిగా, కలిసి వాళ్ళను ఇబ్బంది పెట్టిన సంఘటనలు, వాళ్లకు కోపం తెచ్చి వాళ్ళ దగ్గర పడ్డ చివాట్లు, దెబ్బలు తిన్న స్మృతులు అన్నీ ఒక్క సినిమా రీలులా కళ్ళముందు కనిపిస్తున్నాయి.

అవి గుర్తుకు వచ్చినప్పుడల్లా ఒక్క సారి కళ్ళు చమరుస్తాయి. అమ్మానాన్నలు ఎక్కడవున్నా వాళ్లతో మేము గడిపిన జీవితం, వాళ్లతో పంచుకున్న తీపిగుర్తులు, మధురస్మృతులు మాకు మార్గదర్శకమై మమ్మల్ని మా కుటుంబాలని ముందుకు తీసుకు వెళ్తాయని, వాళ్ళు మా వెన్నంటే వుండి ప్రతి పని లోను, ప్రతి అడుగులోనూ వాళ్ళ ఆశీస్సులతో మా జీవితాల్ని సుగమం చేస్తూనే ఉంటారని వాళ్ళ అస్తిత్వమే మా జీవన యానం అని ప్రగాఢంగా నమ్ముతూ నాన్నగారికి ఈ సుమధుర పుష్పాంజలి.

Syam Sunder
Spiritual Foundation, Inc. 
7062 S. Beringer Drive
Cordova, TN 38018


Click here for Photogallery