బెర్నీ శాండర్స్‌కు మద్దతు ప్రకటించిన ఎఓసీ

బెర్నీ శాండర్స్‌కు మద్దతు ప్రకటించిన ఎఓసీ

21-10-2019

బెర్నీ శాండర్స్‌కు మద్దతు ప్రకటించిన ఎఓసీ

వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న బెర్నీ శాండర్స్‌కు పార్టీ న్యూయార్క్‌ ప్రతినిధి అలెగ్జాండ్రియా అకేషియో కార్టెజ్‌ (ఎఓసి)తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. క్వీన్స్‌బ్రిడ్జ్‌ పార్క్‌ వద్ద జరిగిన బెర్నీస్‌ బ్యాక్‌ ర్యాలీకి హాజరైన ఆయన శాండర్స్‌కు తన మద్దతును ప్రకటించారు. ఆనారోగ్యం కారణంగా మధ్యలో ప్రచారానికి విరామం ఇచ్చిన శాండర్స్‌ తిరిగి ఈ వారం ప్రచారం ప్రారంభించారు. న్యూయార్క్‌ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న అకేషియో కార్టెజ్‌ ఆయన్ను బలపర్చటంతో డెమొక్రాటిక్‌ అభ్యర్థిత్వ వేటలో శాండర్స్‌ అవకాశాలు మరింత మెరుగపడతాయని పరిశీలకులు చెబుతున్నారు. మిన్నెసోటాకు చెందిన కాంగ్రెస్‌ ప్రతినిధి ఇల్హాన్‌ ఉమర్‌ కూడా శాండర్స్‌కు తన మద్దతు ప్రకటించారు. ఈ గ్రూప్‌కు చెందిన మూడో సభ్యురాలు రషీదా త్లాయిబ్‌ కూడా శాండర్స్‌కు మద్దతుప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.