ఫిలడెల్ఫియాలో విజయవంతమైన తానా కల్చరల్ ఫెస్టివల్

ఫిలడెల్ఫియాలో విజయవంతమైన తానా కల్చరల్ ఫెస్టివల్

20-10-2019

ఫిలడెల్ఫియాలో విజయవంతమైన తానా కల్చరల్ ఫెస్టివల్

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్‌ అట్లాంటిక్‌ టీమ్‌ ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో నిర్వహించిన తానా కల్చరల్‌ ఫెస్టివల్‌ విజయవంతమైంది. తానా ఏ కార్యక్రమం చేసినా అది అందరినీ అలరించేలా ఉంటుందన్న విషయాన్ని మరోసారి తానా మిడ్‌ అట్లాంటిక్‌ టీమ్‌ నిజం చేసింది. తానా కార్యదర్శి రవిపొట్లూరి ఆధ్వర్యంలో చేసిన ఏర్పాట్లు అందరినీ ఆకట్టుకుంది. తానా కల్చరల్‌ ఫెస్టివల్‌ అంటే పండుగే అన్నట్లుగా ఈ కార్యక్రమంలో 7 గంటలపాటు నిర్విరామంగా ప్రదర్శించిన సంగీత, నృత్య సాంస్కృతిక కార్యక్రమాలు, సునీత సంగీత విభావరి నిరూపించింది.

ఈ కార్యక్రమానికి వచ్చినవారంతా మధురమైన పాటలు, ఆటలను చూసి ఉల్లాసంగా గడిపారు.  ప్రముఖ గాయని సునీత ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత విభావరిలో వృథ్వీ, శ్రీకృష్ణ, సునీత పాడిన పాటలు మైమరపింపజేశాయి. రామాచారి శిష్యులు పాడిన పాటలు అందరినీ అలరించాయి. ఇలా ఎన్నో కార్యక్రమాలతో తానా కల్చరల్‌ ఫెస్టివల్‌ వచ్చినవారికి కావాల్సినంత వినోదాన్ని అందించింది. సినీనటుడు నిఖిల్‌ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సెనెటర్లతోపాటు తానా అధ్యక్షుడు జే తాళ్ళూరి, ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ అంజయ్య చౌదరి లావు, కార్యదర్శి రవిపొట్లూరి, ట్రెజరర్‌ సతీష్‌ వేమూరి, జాయింట్‌ ట్రెజరర్‌ వెంకట్‌ కోగంటి, హరీష్‌ కోయ, సునీల్‌ పాంత్ర, రజనీకాంత్‌ కాకర్ల, మల్లికార్జున వేమన, సతీష్‌ చుండ్రు, నాగరాజు నలజుల, సత్యనారాయణ మన్నె తదితరులు పాల్గొన్నారు. 

Click here for Event Gallery