తానా ఆసుయంత్రాల పంపిణీకి విరాళం

తానా ఆసుయంత్రాల పంపిణీకి విరాళం

19-10-2019

తానా ఆసుయంత్రాల పంపిణీకి విరాళం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) తెలంగాణలోని పోచంపల్లి చేనేత కార్మికులకు అవసరమైన ఆసు యంత్రాలను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇటీవల తెలంగాణ రాష్ట్ర మంత్రి కే.తారకరామారావు చేతుల మీదుగా ఈ యంత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది.  ఈ యంత్రాలకు అవసరమైన నిధుల సేకరణను తానా చేపట్టింది. చికాగోలో జరిగిన ఐటీ సర్వ్‌ సినర్జీ 2019 కాన్ఫరెన్స్‌లో దాదాపు 250 యంత్రాలకు అవసరమైన నిధులను సేకరించినట్లు తానా అధ్యక్షుడు జే తాళ్ళూరి చెప్పారు. ఈ నిధుల సేకరణ కార్యక్రమానికి సహకరించిన చికాగో తానా నాయకులు హేమ కానూరు, కృష్ణ మోహన్‌, భావనా, బాబురావు బయ్యన తదితరులకు జే తాళ్ళూరి ధన్యవాదాలు తెలిపారు.