స్సేస్‌వాక్‌తో చరిత్ర సృష్టించారు

స్సేస్‌వాక్‌తో చరిత్ర సృష్టించారు

19-10-2019

స్సేస్‌వాక్‌తో చరిత్ర సృష్టించారు

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)కు చెందిన ఇద్దరు మహిళా వ్యోమగాములు స్పేస్‌ వాక్‌ చేశారు. స్పేస్‌ వాక్‌ చేసిన తొలి పూర్తి స్థాయి మహిళా బృందం ఇదే కావడం విశేషం. క్రిస్టినా కోచ్‌, జెస్సికా మెయిర్‌ అనే ఇద్దరు మహిళా వ్యోమగాములు అంతరిక్షంలో నడిచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లోని పవర్‌ కంట్రోలర్‌లో తలెత్తిన లోపాల్ని సవరించారు. పాడైన బ్యాటరీ కంట్రోలర్ల స్థానంలో కొత్తవాటిని అమర్చడానికి క్రిస్టినా కోచ్‌, జస్సికా మెయిర్‌ స్పేస్‌ వాక్‌ చేశారు అని నాసా అధికారులు తెలిపారు. నాసా ఆడ్మినిస్ట్రేటర్‌ జిమ్‌ బ్రైడెన్ట్సైన్‌ మాట్లాడుతూ అంతరిక్షంలో అందరికీ సమాన అవకాశాలుంటాయని నిరూపించే క్రమంలో ఈ ఘటన మైలురాయి లాంటిది. నాకు 11 ఏండ్ల కూతురు ఉన్నది. ఎదుగుతున్నప్పుడు నేను అందుకున్న అన్ని అవకాశాలు తనకూ లభించాలని కోరుకుంటున్నా అని అన్నారు.