ఆస్ట్రేలియాలో టీటా అలాయ్‌ బలాయ్‌

ఆస్ట్రేలియాలో టీటా అలాయ్‌ బలాయ్‌

10-10-2019

ఆస్ట్రేలియాలో టీటా అలాయ్‌ బలాయ్‌

ఆస్ట్రేలియాలో తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ (టీటా) ఆధ్వర్యంలో అలాయ్‌ బలాయ్‌ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీటా ఆస్ట్రేలియా నూతన కార్యవర్గాన్ని నియమించారు. అధ్యక్షుడిగా నరేశ్‌ లాలాను నియమిస్తున్నట్టు టీటా గ్లోబల్‌ ప్రెసిడెంట్‌ సందీప్‌ ముక్తాలా ప్రకటించారు. ఈ సందర్భంగా సందీప్‌ ముక్తాలా మాట్లాడుతూ యువత అమెరికా తర్వాత ఆస్ట్రేలియా వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారన్నారు. కెనడాలోని విద్యార్థులకు కొత్త టెక్నాలజీపై ఆన్‌లైన్‌ ట్రైనింగ్‌ ఇస్తున్నామని, ఆస్ట్రేలియాలోనూ ఈవిధమైన శిక్షణ అందించనున్నట్టు చెప్పారు. స్టార్టప్‌ ప్రారంభించాలనుకొనే వాకి టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌లో భాగస్వామ్యం పొందవచ్చని సూచించారు. నూతన కార్యవర్గంలో ఉపాధ్యక్షులుగా అరుణ్‌ కే సింగారి, పవన్‌ కే సింగారి, ప్రధాన కార్యదర్శిగా కే గోరెంక, కార్యదర్శిగా సాయికుమార్‌ చనమౌల, సంయుక్త కార్యదర్శిగా గోకుల్‌ కీర్తి, కోశాధికారిగా ప్రదీప్‌ కొల్లూరును ఎన్నుకొన్నారు.