బే ఏరియాలో తానా ఆరోగ్య నడక

బే ఏరియాలో తానా ఆరోగ్య నడక

10-09-2019

బే ఏరియాలో తానా ఆరోగ్య నడక

ఉత్తర అమెరికా తెలుగు సంఘం వెస్ట్‌ టీమ్‌ ఆధ్వర్యంలో ఇటీవల ఆరోగ్య నడక, మిషన్‌ పీక్స్‌ హైకింగ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. తానా జాయింట్‌ ట్రెజరర్‌ వెంకట్‌ కోగంటి, తానా రీజినల్‌ కో ఆర్డినేటర్‌ రజనీకాంక్‌ కాకర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తానా నాయకులు మాట్లాడుతూ, 8 వారాలపాటు ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఇప్పటికే 3వారాల కార్యక్రమం పూర్తయిందన్నారు. తానా సభ్యులంతా పాల్గొనేలా కార్యక్రమాన్ని చేస్తున్నామన్నారు. కాగా ఈ కార్యక్రమంలో సురేష్‌ శివపురం, ప్రసాద్‌ మంగిన, ఎంవిరావు, జయచంద్రబాబు, లక్ష్మీపతి, సురేష్‌, అరుణ్‌ తదితరులు పాల్గొన్నారు.