తాలిబన్‌ నేతలతో ట్రంప్‌ రహస్య భేటీ రద్దు

తాలిబన్‌ నేతలతో ట్రంప్‌ రహస్య భేటీ రద్దు

09-09-2019

తాలిబన్‌ నేతలతో ట్రంప్‌ రహస్య భేటీ రద్దు

తాలిబాన్‌ నేతలు, అఫ్ఘాన్‌ అధ్యక్షుడు అష్రాప్‌ ఘనితో రహస్య సమావేశాన్ని అమెరికా అధ్యక్షుడు రద్దు చేసుకున్నారు. దీంతో శాంతి ఒప్పందం కోసం నెల రోజులుగా జరుగుతున్న చర్చలకు పెద్ద విఘాతం ఏర్పడినట్లైంది. కాబూల్‌ బాంబు దాడిలో అమెరికా సైనికుడుతో పాటు మరో 11 మంది మృతికి తామే బాధ్యులమని తిరుగుబాటుదారులు ప్రకటించారు. దీంతో అఫ్ఘాన్‌ అధ్యక్షుడు, సీనియర్‌ తాలిబన్‌ నాయకులతో తన సమేవేశాన్ని రద్దు చేసుకున్నట్లు ట్రంప్‌ వరుస ట్వీట్లు చేశారు. అఫ్ఘన్‌లో శాశ్వత శాంతి కోసం అమెరికా, తాలిబాన్‌ ప్రతినిధులు, మధ్య దోహాలో తొమ్మిది రౌండ్ల చర్చలు జరిగిన తర్వాత చర్చలను నిలిపివేసినట్లు ట్రంప్‌ తెలిపారు.