ప్రియాంక చోప్రాకు పాక్‌ షాక్‌

ప్రియాంక చోప్రాకు పాక్‌ షాక్‌

22-08-2019

ప్రియాంక చోప్రాకు పాక్‌ షాక్‌

బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా పై పాకిస్థాన్‌ ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేసింది. యూనిసెఫ్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా తొలగించాలని పాక్‌ మానవ వనరుల మంత్రి షిరీన్‌ మజరి ఐక్యరాజ్య సమితికి లేఖ రాశారు. కశ్మీర్‌పై భారత వైఖరిని ప్రియాంక చోప్రా బాహాటంగా సమర్ధించడంతో పాటు భారత రక్షణ మంత్రి పాకిస్థాన్‌కు చేసిన అణ్వస్త్ర ప్రయోగ హెచ్చరికలను వెనకేసుకొచ్చారని, ఇది శాంతి, సామరస్య భావనలకు విరుద్ధమని మజరి ఐరాసకు రాసిన లేఖలో ఆరోపించారు. ఐరాస గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా ప్రియాంక చోప్రా శాంతి వెల్లివిరిసేలా వ్యవహరించాల్సిన అవసరం ఉందని హితవు పలికారు.