ఏపీ అభివృద్ధికి సహకరించండి

ఏపీ అభివృద్ధికి సహకరించండి

20-08-2019

ఏపీ అభివృద్ధికి సహకరించండి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చేపట్టే సామాజిక, ఆర్థికాభివృద్ది కార్యక్రమాలకు సహకారం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రపంచ బ్యాంకును కోరారు. వాషింగ్టన్‌ డీసీలో ప్రపంచబ్యాంకు ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేపట్టబోతున్న నవరత్న కార్యక్రమాలను, వాటివల్ల పేదరిక నిర్మూలన ఎలా జరుగుతుందో, సామాజిక ఆర్థిక విప్లవం ఎలా వస్తుందో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా జగన్‌ వివరించారు. అనంతరం పారిశ్రామిక, వ్యాపార దిగ్గజ సంస్థల ప్రతినిధులతోనూ ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.