నాలుగు కొత్త ఫీచర్లతో వాట్సాప్‌!

నాలుగు కొత్త ఫీచర్లతో వాట్సాప్‌!

19-08-2019

నాలుగు కొత్త ఫీచర్లతో వాట్సాప్‌!

స్మార్ట్‌ఫోన్‌ యుగంలో వాట్సాప్‌ అనేది ఓ సంచలనం. ఫొటోలు, వీడియో, ఆడియో క్లిప్పింగ్‌లను క్షణాల్లో చేరవేయడంతో పాటు సందేశాలు, వాయిస్‌, వీడియో కాలింగ్‌ వంటి ఫీచర్లు అందిస్తున్న ఈ యాప్‌ అనతికాలంలోనే అత్యంత ఆదరణ పొందింది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ వస్తున్న వాట్సాప్‌.. తాజాగా మరో నాలుగు కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టేందుకు సిద్దమైంది. అవేమిటంటే, మన ప్రవేయం లేకుండా ఎవరో క్రియేట్‌ చేసిన గ్రూపులో చేరిపోతుంటాం. అయితే కొత్తగా ప్రవేశపెట్టిన ప్రైవసీ సెట్టింగ్‌ వలన అలా గ్రూపులో చేరాలంటే మన అనుమతి తప్పనిసరి అవుతుది. దీని వలన మన ఫోన్‌ బుక్‌లో నంబరు ఉన్న వ్యక్తి క్రియేట్‌ చేసిన గ్రూపులో మాత్రమే మనం చేరే అవకాశం ఉంటుంది.

కాంటాక్టు లిస్టులో ఉన్న వ్యక్తి గ్రూపులో మనల్ని యాడ్‌ చేయాలని చూసినా.. అందకు అనుమతి తప్పనిసరి. మనకు ఆహ్వానం వచ్చిన 72 గంటల్లోగా దాన్ని ఓకే చేయకపోతే ఆ గ్రూప్‌లో మనం చేరే అవకాశం ఉండదు. అలాగే వాట్సాప్‌లో ఈ నంబరును గ్రూపుల్లో యాడ్‌ చేయవద్దు అనే ఆప్షన్‌ను కూడా ఎంచుకునే వీలుంది. దీనితోపాటు వేలిముద్ర సాయంతో వాట్సాప్‌ను ఆన్‌లాక్‌ చేసే సదుపాయం కల్పించింది. స్పామ్‌ మెసేజ్‌లను తేలికగా గుర్తించేందుకు వాట్సాప్‌ ఫ్రీక్వెంట్లీ ఫార్వర్డెడ్‌ ఫీచర్‌ను ప్రారంభించింది. వాట్సాప్‌లో ఒకేసారి అనేక వాయిస్‌ మెసేజ్‌లు వరుసగా వినేందుకు వీలుగా సరికొత్త ఫీచర్‌ను తెలుస్తున్నారు.