బెర్లిన్‌లో ఘనంగా తెలంగాణ సాంస్కృతిక ఉత్సవాలు

బెర్లిన్‌లో ఘనంగా తెలంగాణ సాంస్కృతిక ఉత్సవాలు

19-08-2019

బెర్లిన్‌లో ఘనంగా తెలంగాణ సాంస్కృతిక ఉత్సవాలు

భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జర్మనీ రాజధాని బెర్లిన్‌లో తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో సాంస్కృతిక ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. దాదాపు 600 మంది భారతీయ కుటుంబాల వారు ఇందులో పాల్గొన్నారు. జర్మనీలోని భారత రాయబార కార్యాలయ అధికారిణి మీరా త్రిపాఠి, ఎంపీ మనూలాల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భారతీయ సంస్కృతిక సంఘాధ్యక్షుడు వైద్యనాథన్‌, జర్మనీ తెలంగాణ సంఘం అధ్యక్షుడు చలిగంటి రఘు పాల్గొన్నారు.