న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియా మొదటి సాహితీ సదస్సు - రెండవ ప్రకటన

న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియా మొదటి సాహితీ సదస్సు - రెండవ ప్రకటన

19-08-2019

న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియా మొదటి సాహితీ సదస్సు - రెండవ ప్రకటన

ఇప్పుడే అందిన "న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియా మొదటి సాహితీ సదస్సు - రెండవ ప్రకటన" ఇందుతో జతపరుస్తున్నాను. తెలుగు సాహిత్య ప్రపంచంలో చరిత్ర సృష్టించే ఈ సాహితీ సదస్సు, వారి మాటలలోనే చెప్పాలంటే "వంగూరి ఫౌండేషన్" స్ఫూర్తి తో న్యూ జీలాండ్ దేశ రాజధాని ఆక్లండ్ లో నవంబర్ 16-17, 2019 తేదీలలో జరుగుతోంది. 

ఆసక్తి ఉన్నవారు, ముఖ్యంగా విదేశాలలో ఉన్న వారు ఈ సవదకాశాన్ని ఉపయోగించుకుని కుటుంబ సమేతంగా భూతల స్వర్గంగా కొనియాడబడే న్యూజిలాండ్ దేశాన్ని సందర్సించండి.  తెలుగు నాట ఆంగ్ల భాషకి పట్టం కడుతూ, మన మాతృభాషని నిర్వీర్యం అవుతూ దిక్కు తోచని ఈ తరుణంలో మీరు తెలుగు భాషా సాహిత్యాల కి ఒక నూలు పోగు సమర్పించండి. 

ఇంతటి మంచి ఆలోచన చేసి ఎంతో ఉత్సాహంతో, సాహసంతో ఆచరణ లో పెడుతున్న న్యూజిలాండ్,  ఆస్ట్రేలియా దేశాల నిర్వాహకులకి మా హృదయపూర్వక అభినందనలు, అభివాదాలు. 

వంగూరి చిట్టెన్ రాజు
Phone: 832 594 9054

-------------------------------------------

సాహితీ బంధువుకి ప్రణామములు

ఆక్లాండ్ నగరంలో నవంబరు 16-17 తేదీలలో జరగనున్న సాహితీ సదస్సుకు ఇదివరకే మీకు ఒక ప్రత్యేక ఆహ్వానము పంపడం జరిగింది.  ఇప్పుడు మరిన్ని వివరాలతో రెండవ ప్రకటనతో పాటు నమోదు పత్రం ఇందులో జతచేయడం జరిగింది.  మీరు కుటుంబ సమేతంగా విచ్చేసి ఈ సాహితీ సదస్సులో పాల్గొని మా ఆతిథ్యాన్ని స్వీకరించగలరని ఆశిస్తున్నాను.

అతిథుల అవసరార్ధం రెండు హోటళ్ళలో ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేయడం జరిగింది.  అంతే కాకుండా ప్రయాణ సదుపాయాలు చూడడానికి ఇద్దరు ప్రత్యేక సభ్యుల బృందం కూడా  ఏర్పాటు చేయడం జరిగింది.  వీరే కాకుండా సదస్సు సంచాలకులు, సమన్వయ కర్తలు మరియు సలహాదారులు మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు.

ఏ వివరాలు కావాలన్నా తప్పకుండా సంప్రదించగలరు.

శ్రీలత మగతల 
అధ్యక్షురాలు NZTA