పాకిస్థాన్‌కు అమెరికా మరో షాక్‌

పాకిస్థాన్‌కు అమెరికా మరో షాక్‌

17-08-2019

పాకిస్థాన్‌కు అమెరికా మరో షాక్‌

కశ్మీర్‌ అంశాన్ని అంతర్జాతీయం చేసేందుకు అమెరికా సాయం కోరి భంగపడిన పాకిస్థాన్‌కు మరో షాక్‌ తగిలింది. ఆర్థికంగా ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న పాకిస్థాన్‌కు అమెరికా ఆర్థిక సాయంలో దాదాపు 440 మిలియన్‌ డాలర్ల మేర కోత పడింది. దీంతో అమెరికా నుంచి పాక్‌కు అందాల్సిన ఆర్థిక సాయం 4.1 బిలియన్‌ డాలర్లకు తగ్గిపోయింది. పాకిస్థాన్‌ అభివృద్ధి భాగస్వామ్య ఒప్పందం (పీఈపీఏ)-2010 కింద అమెరికా నుంచి ఈ సాయం అందుతున్నట్టు ఎక్స్‌ప్రెస్‌ ట్రిబ్యూన్‌ పేర్కొంది. పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఇటీవల వాషింగ్టన్‌ పర్యటనకు వెళ్లేముందే ఆర్ధిక సాయంలో కోత విషయాన్ని అమెరికా ఆయనకు తెలియజేసినట్లు సమాచారం.