ట్రంప్‌ ప్రతిపాదన... నో అన్న గ్రీన్‌ల్యాండ్‌

ట్రంప్‌ ప్రతిపాదన... నో అన్న గ్రీన్‌ల్యాండ్‌

17-08-2019

ట్రంప్‌ ప్రతిపాదన... నో అన్న గ్రీన్‌ల్యాండ్‌

గ్రీన్‌ల్యాండ్‌ పేరులో మాత్రమే గ్రీన్‌ ఉన్న డెన్మార్క్‌లో ఓ స్వయంపాలిత ప్రాంతమిది. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ ద్వీపంపై అగ్రరాజ్యం అమెరికా అధిపతి డోనాల్డ్‌ ట్రంప్‌ మనసుపడ్డారు. కెనడాకు ఈశాన్య ప్రాంతంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను కొనేస్తే బాగుంటుందంటూ కొందరు అధికారులు ట్రంప్‌కు సలహా ఇచ్చారు. రక్షణ వ్యవహారాల పరంగా కలిసొస్తుందని చెప్పారు. వారి సలహా నచ్చడంతో ట్రంప్‌ కూడా సై అన్నారు. కానీ వీరి ఆశలపై గ్రీన్‌ల్యాండ్‌ నీళ్లు చల్లేసింది. వ్యాపారబంధమైతే తామూ సిద్ధమేనని, కానీ అమ్మాలంటే మాత్రం కుదరదని సృష్టం చేసింది. ట్రంప్‌ నిజంగా ఈ ఆలోచన చేసి ఉంటే ఆయనకు పిచ్చెక్కిందనడానికి ఇదే నిదర్శనమని డెన్మార్‌ మాజీ ప్రధాని రాస్మూసెన్‌ వ్యాఖ్యానించారు. వాస్తవానికి గ్రీన్‌ల్యాండ్‌ డెన్మార్‌ లోని భాగమే. కానీ, ఇది స్వతంత్ర ప్రతిపత్తితో స్వయం పాలిత ప్రాంతంగా ఉంది. గ్రీన్‌ల్యాండ్‌ విస్తీర్ణం 7.72 లక్షల చదరపు మైళ్లు. 85 శాతం ప్రాంతం మంచుతో కప్పబడి ఉంటుంది. జనాభా 57,000.