ఆయన ప్రతి ఒక్కరిని సంతోషపెట్టే పని చేస్తారు : ట్రంప్‌

ఆయన ప్రతి ఒక్కరిని సంతోషపెట్టే పని చేస్తారు : ట్రంప్‌

17-08-2019

ఆయన ప్రతి ఒక్కరిని సంతోషపెట్టే పని చేస్తారు : ట్రంప్‌

హాంకాంగ్‌ ప్రజాస్వామ్య అనుకూల ఆందోళనకారులతో సమావేశం కావాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కోరారు. ఈ సమస్యను జిన్‌పింగ్‌ మానవత్వం తో పరిష్కరించాలని కోరారు. న్యూజెర్సీలోని మొర్రిస్‌ టౌన్‌ విమానాశ్రయం వద్ద ట్రంప్‌ మీడియాతో మాట్లాడారు. జిన్‌పింగ్‌తో త్వరలో మాట్లాడతాను. ఆయన ప్రతి ఒక్కరిని సంతోషపెట్టే పని చేస్తారు అని ట్రంప్‌ చెప్పారు. హాంకాంగ్‌ సమస్యను జిన్‌పింగ్‌ మానవత్వ కోణంలో పరిష్కరిస్తారనడంలో సందేహం లేదు అని ట్వీట్‌ కూడా చేశారు.

అయితే తమ అంతర్గత సమస్యల పరిష్కారంలో విదేశీ జోక్యం అవసరం లేదని చైనా సృష్టం చేయడం గమనార్హం. హాంకాంగ్‌లోని నిందితులను చైనాకు అప్పగించాలని ప్రతిపాదించిన బిల్లును వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్య అనుకూల నిరసనకారులు కొన్ని వారాలుగా ఆందోళన చేస్తున్నారు. వారు ఇటీవల హాంకాంగ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలోకి చొరబడి గందరగోళం సృష్టించారు.