ట్రంప్‌ వ్యాఖ్యలను ఖండించిన భారత్‌

ట్రంప్‌ వ్యాఖ్యలను ఖండించిన భారత్‌

23-07-2019

ట్రంప్‌ వ్యాఖ్యలను ఖండించిన భారత్‌

భారత్‌, పాకిస్థాన్‌ కోరితే కశ్మీర్‌ అంశంపై మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు. ఈ వ్యాఖ్యలను భారత్‌ ఖండించింది. ప్రధాని మోదీ ఎటువంటి విజ్ఞాపనలు చేయలేదని విదేశాంగ శాఖ తన ట్విట్టర్‌లో పేర్కొన్నది. విదేశాంగ కార్యదర్శి రావీష్‌ కుమార్‌ ట్వీట్‌ చేస్తూ భారత్‌, పాక్‌ మధ్య ఉన్న ఎటువంటి సమస్యలైనా ద్వైపాక్షికంగానే పరిష్కారం కావాలన్నారు. సీమాంతర ఉగ్రవాదం నిలిపివేస్తేనే పాక్‌తో సంప్రదింపులు సాధ్యమన్నారు. రెండు దేశాల మద్య గతంలో కుదరిని సిమ్లా, లాహోర్‌ అగ్రిమెంట్‌ ప్రకారమే ముందుకు వెళ్లాలని రావిశ్‌ కుమార్‌ తెలిపారు.