తానా మహాసభలకు చంద్రబాబును ఆహ్వానించిన సతీష్‌ వేమన

తానా మహాసభలకు చంద్రబాబును ఆహ్వానించిన సతీష్‌ వేమన

15-04-2019

తానా మహాసభలకు చంద్రబాబును ఆహ్వానించిన సతీష్‌ వేమన

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) జూలైలో వాషింగ్టన్‌ డీసిలో నిర్వహించే 22వ తానా మహాసభలకు రావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తానా అధ్యక్షుడు సతీష్‌ వేమన, అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, తానా మాజీ అధ్యక్షుడు జయరాం కోమటి, తానా కాన్ఫరెన్స్‌ కో ఆర్డినేటర్‌ ప్రసాద్‌ గారపాటి ఆహ్వానించారు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును వారు కలిశారు. ఈ సందర్భంగా 2007లో వాషింగ్టన్‌ డీసిలో జరిగిన అప్పటి తానా మహాసభలకు చంద్రబాబు వచ్చిన విషయాన్ని వారు గుర్తు చేశారు. కాగా ఈ మహాసభలకు తప్పకుండా వస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామి ఇచ్చారని సతీష్‌ వేమన తెలిపారు.