భారత్ లో 6 లక్షల మంది డాక్టర్ల కొరత

భారత్ లో 6 లక్షల మంది డాక్టర్ల కొరత

15-04-2019

భారత్ లో 6 లక్షల మంది డాక్టర్ల కొరత

భారత్‌ తీవ్రస్థాయిలో వైద్యుల కొరతను ఎదుర్కొంటోంది. మన దేశానికి 6 లక్షల మంది డాక్టర్లు, 20 లక్షల మంది నర్సులు తక్కువగా ఉన్నట్లు అంచనా. భారత్‌లో ప్రతి 10,189 మందికి ఒక ప్రభుత్వ వైద్యుడే ఉన్నారు. నర్సు, రోగుల నిష్పత్తి 1:483గా ఉంది. ఈ క్రమంలో యాంటీబయాటిక్స్‌ ఇవ్వడంతో తగినంత శిక్షణ ఉన్న సిబ్బంది కొరత కారణంగా రోగులకు ప్రాణం నిలిపే మందులు అందడం లేదని నిపుణులు చెబుతున్నారు. సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ డైనమిక్స్‌, ఎకనామిక్స్‌, పాలసీ (సీడీడీఈపీ) ఈ నివేదిక వెల్లడించింది. భారత్‌లో 65 శాతం వైద్య చికిత్సలకయ్యే వ్యయం భరించలేని స్థాయిలో ఉండటంతో, ఏటా 5.7 కోట్ల మంది పేదరికం బారిన పడుతున్నట్లు తేలింది.