ట్రంప్ తో మరొక సమావేశానికి తాను సిద్ధం

ట్రంప్ తో మరొక సమావేశానికి తాను సిద్ధం

13-04-2019

ట్రంప్ తో మరొక సమావేశానికి తాను సిద్ధం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో మరొక సమావేశానికి తాను సిద్ధంగా ఉన్నానని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ అన్నారు. ఇరు దేశాల మధ్య అణు దౌత్యంపై పరస్పర అంగీకారయోగ్యమైన ఒప్పందం కుదుర్చుకోవడానికి ఈ ఏడాది చివరి వరకూ వాషింగ్టన్‌కు డెడ్‌లైన్‌ విధిస్తున్నట్లు ఆయన తెలిపారు. అమెరికా ఏకపక్ష డిమాండ్ల కారణంగానే గత ఫిబ్రవరిలో ట్రంప్‌తో జరిగిన సమావేశం విఫలమైందని కిమ్‌ ఆరోపించారు. అయితే ట్రంప్‌తో తన వ్యక్తిగత స్నేహ సంబంధాలు బాగున్నాయని ఆయన తెలిపారు.