భారతీయ విద్యార్థులు జాగ్రత.. అమెరికా అధికారులు

భారతీయ విద్యార్థులు జాగ్రత.. అమెరికా అధికారులు

12-04-2019

భారతీయ విద్యార్థులు జాగ్రత.. అమెరికా అధికారులు

ఉన్నత విద్యాకోర్సుల్లో చేరేందుకు అమెరికాకు వచ్చే భారతీయ విద్యార్థులు ఆయా యూనివర్సిటీల్లో అడ్మిషన్లు తీసుకునే ముందు జాగ్రత్తగా, చురుగ్గా వ్యవహరించాలని అమెరికా అధికారులు అడ్వైజరీ(సూచన) జారీ చేశారు. భారతీయ విద్యార్థులు పలు అంశాలను, ప్రత్యేకించి మూడు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సృష్టం చేశారు. గత జనవరిలో పే టు స్టే వీసా రాకెట్‌లో ఒక నకిలీ యూనివర్సిటీలో పేర్లు నమోదు చేసుకున్న 129 మంది భారతీయ విద్యార్థులను అమెరికా అధికారులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సదరు యూనివర్సిటీ ఒక క్యాంపస్‌ నుంచే నడుస్తున్నదా? పరిపాలనా విభాగంలోనే వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నారా? లేదా?.

వివిధ పాఠ్యాంశాలను బోధించేందుకు ఫ్యాకల్టీ, రెగ్యులర్‌ ఇన్‌స్రక్టర్లు/ బోధకులు ఉన్నారా?. యూనివర్సిటీల్లో సరైన విద్యా ప్రణాళిక, రెగ్యులర్‌ తరగతుల బోధన, చురుగ్గా అకడమిక్‌, బోధనా కార్యక్రమాలు సాగుతున్నాయా?. లేనిపక్షంలో ఆ యూనివర్సిటీల్లో చేరకుండా ఉండటమే సరైన చర్య అని అడ్వైజరీలో పేర్కొన్నారు. నకిలీ యూనివర్సిటీల్లో చేరిన విద్యార్థులు రెగ్యులర్‌ వీసా పొందినా వీసా నిబంధనలు ఉల్లంఘించిన వారిగానే పరిగణించి... అదుపులోకి తీసుకుని భారత్‌కు పంపేస్తామని సృష్టం చేశారు. 

అమెరికా హోంల్యాండ్‌ సెక్యూరిటీ శాఖ అండర్‌ కవర్‌ ఆపరేషన్‌లో భాగంగా డెట్రాయిట్‌ ఫర్మింగ్టన్‌ హిల్స్‌ వర్సిటీ నిర్వహించిన అడ్మిషన్లలో ఇమిగ్రేషన్‌ ఫ్రాడ్‌ను బయటపెట్టిన సంగతి తెలిసిందే. భారతీయ విద్యార్థులు నకిలీ వర్సిటీల వలలో పడకుండా చురుగ్గా వ్యవహరించాలని అమెరికాలో భారత రాయబార కార్యాలయం అధికార ప్రతినిధి శంభు హక్కీ కూడా పేర్కొన్నారు.