భారతీయులకు ప్రతిష్ఠాత్మక గేట్స్ కేంబ్రిడ్జ్ స్కాలర్ షిప్

భారతీయులకు ప్రతిష్ఠాత్మక గేట్స్ కేంబ్రిడ్జ్ స్కాలర్ షిప్

12-04-2019

భారతీయులకు ప్రతిష్ఠాత్మక గేట్స్ కేంబ్రిడ్జ్ స్కాలర్ షిప్

అత్యంత ప్రతిష్ఠాత్మక గేట్స్‌ కేంబ్రిడ్జ్‌ స్కాలర్‌షిప్‌-2019 కు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి ఎంపికైన 90 మంది పోస్టు గ్రాడ్యుయేట్‌లలో ఏడుగురు భారతీయులున్నారు. కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయం ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. వీరు ఆయా సబ్జెక్టులలో కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేస్తారు. ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన అత్యంత ప్రతిభాశీలురైన ఏడుగురు భారతీయుల్లో నికిత ముమ్మిడివరపు (హిస్టరీ, ఫిలాసఫీ) ధృవ్‌ నందమూడి (బయాలాజికల్‌ సైన్సెస్‌)లున్నారు. వీరితో పాటు అర్జున్‌ అశోక్‌ (జెండర్‌ స్టడీస్‌), కనుప్రియాశర్మ (క్రిమినాలజీ), రితికా సుబ్రమణియన్‌ (జెండర్‌స్టడీస్‌), అవని వీయిరా(ఆంగ్లం), నిషాంత్‌ గోఖలే (లీగల్‌ స్టడీస్‌)లున్నారు. గేట్స్‌ కేంబ్రిడ్జ్‌ స్కాలర్లంటనే అత్యంత అరుదైన నైపుణ్యాలు కలిగిన ప్రతిభావంతులని కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయం ప్రశంసించింది.