ఎన్ఆర్ఐలకు కృతజ్ఞతలు : రవి వేమూరి

ఎన్ఆర్ఐలకు కృతజ్ఞతలు : రవి వేమూరి

12-04-2019

ఎన్ఆర్ఐలకు కృతజ్ఞతలు  : రవి వేమూరి

సార్వత్రిక ఎన్నికల్లో ప్రవాసాంధ్రులు పెద్దఎత్తున పాల్గొని ఓటు హక్కు వినియోగించుకున్నందుకు ప్రవాసాంధ్ర తెలుగు సొసైటీ ఎండీ వేమూరి రవి కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యక్షంగా 1200 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోగా, మరో లక్ష మంది వరకు ఫోన్‌కాల్స్‌, ప్రచార రథాల వెంబడి వెళ్లి ఓటు వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించారు. ఎన్‌ఆర్‌ఐలకు తొలిసారిగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడం దేశచరిత్రలోనే మొదటిసారిగా పారిశ్రామికవేత్తలుగా గుర్తిసామని వాగ్దానం చేయడంతో వీరు పెద్ద సంఖ్యలో ఎన్నికల ప్రక్రియాలో భాగస్వాములు అయినట్లు తెలిపారు.