ఎన్నికల్లో ఎవరు గెలుపొందినా... భారత్ తో సత్సంబంధాలు : అమెరికా

ఎన్నికల్లో ఎవరు గెలుపొందినా... భారత్ తో సత్సంబంధాలు : అమెరికా

22-03-2019

ఎన్నికల్లో ఎవరు గెలుపొందినా... భారత్ తో సత్సంబంధాలు : అమెరికా

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హయాంలో భారత్‌-అమెరికా మధ్య సంబంధాలు బలపడాయని శ్వేతసౌధానికి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. లోక్‌సభ ఎన్నికల తరువాత ఈ సంబంధాలు మరింత బలపడే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. గతేడాది ఇరు దేశాల మధ్య జరిగిన టూ ప్లస్‌ టూ చర్చలు సత్సంబంధాలు మరింత ముందుకెళ్లేలా దోహదపడ్డాయని సృష్టం చేశారు. 2017లో మోదీ అమెరికా పర్యటన కూడా సంబంధాల మెరుగులో కీలక పాత్ర పోషించిందన్నారు. ఇటీవల విదేశాంగ శాఖ ప్రధాన కార్యదర్శి విజయ్‌ గోఖలే జరిపిన పర్యటన వాటికి కొనసాగింపేనని ఆయన అభిప్రాయపడ్డారు. సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ మైక్‌ పాంపియో నుంచి అమెరికా భద్రతా సలహాదారు జాన్‌ బోల్టన్‌ వరకూ ప్రతి ఒక్కరితో గోఖలే కీలక చర్చలు జరిపారని వెల్లడించారు. 

రానున్న ఎన్నికల్లో ఎవరు గెలుపొందినా భారత్‌తో సత్సంబంధాలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. వ్యూహాత్మకంగా భారత్‌తో బంధం అమెరికాకు చాలా కీలకమని అభిప్రాయపడ్డారు. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో అమెరికా వ్యూహాత్మక కదలికలను భారత్‌ నుంచి తోడ్పాటు లభించడం వైపు దృష్టి సారించామని తెలిపారు.