అమెరికన్ యువతికి అరుదైన గౌరవం

అమెరికన్ యువతికి అరుదైన గౌరవం

22-03-2019

అమెరికన్ యువతికి అరుదైన గౌరవం

పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న కృషికిగానూ హైదరాబాదీ కుటుంబానికి చెందిన పాతికేళ్ల అమెరికన్‌ యువతికి అరుదైన గౌరవం లభించింది. పర్యావరణ విధానం-2019లో ప్రపంచవ్యాప్తంగా 100 మంది అత్యంత ప్రభావశీలుర జాబితాలో వర్షిణీ ప్రకాశ్‌ చోటు దక్కించుకుంది. ఈ మేరకు గ్లోబల్‌ నెట్‌ వర్క్‌ సంస్థ అపొలిటికల్‌ ఒక జాబితా విడుదల చేసింది. హైదరాబాద్‌కు చెందిన వర్షిణి తల్లిదండ్రులు అమెరికాలోని బోస్టన్‌లో స్థిరపడ్డారు. అక్కడే పుట్టి పెరిగిన వర్షిణి సన్‌రైజ్‌ సంస్థకు కో ఫౌండర్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆ సంస్థ ఆధ్వర్యంలో వాతావరణ మార్పులపై, తీసుకోవాల్సిన చర్యలపై యువతలో చైతన్యం కలిగిస్తున్నారు.

కాగా ఈ 100 మంది అత్యంత ప్రభావశీలుర జాబితలో కేంద్రమంత్రులు పీయూష్‌ గోయల్‌, హర్షవర్థన్‌ చోటు దక్కించుకున్నారు. వారితో పాటు పుణే మేయర్‌, బాలగంగాధర్‌ తిలక్‌ మని మనువడు శైల్‌శ్‌ తిలక్‌ భార్య ముక్త తిలక్‌, ఇంటిగ్రేటెడ్‌ రీసెర్చ్‌ అండ్‌ యాక్షన్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ జ్యోతి కిరీట్‌ పారిఖ్‌, సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ డైరెక్టర్‌ సునీత నరైన్‌, రీసెర్చ్‌ ఫౌండేషన్‌ ఫర్‌ సైన్స్‌ టెక్నాలజీ అండ్‌ నేచురల్‌ రిసోర్స్‌ పాలసీ ఫౌండర్‌ వందన శివ, ఇంటర్నేషనల్‌  సోలార్‌ అలియన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఉపేంద్ర త్రిపాఠి ఈ జాబితాలో స్థానం దక్కించుకున్నారు.