ది వరల్డ్స్ బెస్ట్ టైటిల్ విజేతకు రెహ్మాన్ అభినందనలు

ది వరల్డ్స్ బెస్ట్ టైటిల్ విజేతకు రెహ్మాన్ అభినందనలు

20-03-2019

ది వరల్డ్స్ బెస్ట్ టైటిల్ విజేతకు రెహ్మాన్ అభినందనలు

అమెరికాలో ది వరల్డ్స్‌ బెస్ట్‌ టైటిల్‌ని కైవసం చేసుకున్న చెన్నై బాలుడికి సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌ అభినందనలు తెలిపారు. అమెరికాలో ది వరల్డ్స్‌ బెస్ట్‌ అనే రియాల్టీ షో జరిగింది. ఇందులో పలు దేశాలకు చెందిన కళాకారులు బృందాలుగా, ఒంటరిగా పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఇందులో చెన్నైకి చెందిన తెలుగు తేజం లిడియన్‌ నాదస్వరం అత్యంత వేగంగా పియానో వాయించి అందరినీ మంత్రముగ్ధులు చేశాడు. దీంతో లిడియనో ది వరల్డ్స్‌ బెస్ట్‌ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఈ షోకు జడ్జీగా వ్యవహహరించినవారు లిడియన్‌ ప్రతిభకు ముగ్ధులయ్యారు. లిడియన్‌ తన ప్రతిభ ద్వారా యావత్‌ ప్రపంచాన్ని భారతదేశంవైపు చూసేలా చేశాడని, తనకెంతో గర్వకారణంగా ఉందని మ్యాజిక్‌ మాస్ట్రో ఏఆర్‌ రెహ్మాన్‌ అభినందించారు. పియానోతో ప్రపంచాన్ని అబ్బురపరచిన లిడియన్‌ తమ విద్యార్థి కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. లిడియన్‌కి రెహ్మాన్‌ అభినందనలు తెలిపారు.