బాధితులపైనే కేసులు!

బాధితులపైనే కేసులు!

11-02-2019

బాధితులపైనే కేసులు!

అమెరికా ఇమిగ్రేషన్‌ అధికారులు వింత పోకడ అనుసరిస్తున్నారు. అమెరికాలోని ఉద్యోగాలను స్థానికులకే కేటాయించాలనే నెపంతో విదేశీ విద్యార్థులను వెళ్లగొట్టేందుకు కుట్ర పన్నారు. మిచిగాన్‌ నగరంలో ఫర్మింగ్‌టన్‌ పేరిట ఓ నకిలీ వర్సిటీ సృష్టించి విద్యార్థుల ప్రవేశాలను ఆహ్వానించారు. విద్యార్థులు తరగతులకు హాజరవుతామని కోరినప్పటికీ అధిక ఫీజులు చెల్లిస్తే చాలు హాజరయ్యే అవసరం లేదంటూ నమ్మపలికారు. అమెరికాలో తాత్కాలిక వీసాల కోసం విద్యార్థులకు ఎఫ్‌-1 వీసాలు అందజేశారు. అమెరికా ఇమిగ్రేషన్‌ అధికారుల్లో బలైపోయిన వారిలో భారతీయ విద్యార్థులు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. విద్యార్థులను వర్సిటీల్లో చేర్పించిన వారిపై చర్యలు చేపట్టకుండా బాధితులపైనే తప్పుడు కేసులు బనాయించి యూఎస్‌ ఇమిగ్రేషన్‌ అధికారులు తమ కర్కషాన్ని చూపుతున్నారు. వంద మంది విద్యార్థులు అమెరికా జైళ్లల్లో ముగ్గుతున్నారు. న్యాయసాయం కోసం ఆర్థిస్తున్నారు. అమెరికాలో విద్యను అభ్యసించేందుకు భారతీయ విద్యార్థులే అధిక సంఖ్యలో వెళ్తున్నారు.