డొనాల్డ్ ట్రంప్, కిమ్ భేటీకి వేదిక ఖారారు

డొనాల్డ్ ట్రంప్, కిమ్ భేటీకి వేదిక ఖారారు

09-02-2019

డొనాల్డ్ ట్రంప్, కిమ్ భేటీకి వేదిక ఖారారు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ మధ్య రెండవ సారి జరిగే చర్చలకు వేదిక ఖరారైంది. వియత్నాంలోని హనోయ్‌లో చర్చలు జరగనున్నట్లు ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. ఈ నెల 27, 28వ తేదీల్లో ఈ భేటీ ఉంటుంది. రెండు దేశాల మధ్య శాంతి చర్చలు జరగనున్నట్లు ట్రంప్‌ తెలిపారు. తమ దేశ ప్రతినిధులు ఉత్తర కొరియా నేతలతో మాట్లాడినట్లు ఆయన చెప్పారు. కిమ్‌ జాంగ్‌ ఉన్‌ నేతృత్వంలో.. ఉత్తర కొరియా ఆర్థికశక్తిగా వెలుగుతుందని ట్రంప్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. అందర్నీ ఆశ్చర్యపరిచే సత్తా కిమ్‌కు ఉందని, కానీ తనను మాత్రం అతను ఏమీ చేయడలేడని, తానేంటో అతనికి తెలుసని ట్రంప్‌ అన్నారు.

ఉత్తర కొరియా తన అణుఆయుధాలను పూర్తిగా నిర్వీర్యం చేయాలని అమెరికా డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఓ దశలో ఈ రెండు దేశాలు పరోక్ష హెచ్చరికలు చేసుకున్నాయి. ఆ తర్వాత ట్రంప్‌, కిమ్‌లు సింగపూర్‌ వేదికపై కలుసుకున్నారు. ఇప్పుడు హనోయ్‌లో రెండవసారి కలుసుకోబోనున్నారు.