ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ గా డేవిడ్ మాల్పాస్

ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ గా డేవిడ్ మాల్పాస్

08-02-2019

ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ గా డేవిడ్ మాల్పాస్

ప్రపంచ బ్యాంక్‌ ప్రెసిడెంట్‌గా ఆర్థికవేత్త డేవిడ్‌ మాల్పాస్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నామినేట్‌ చేశారు. ట్రంప్‌కు విదేయుడైన ఆర్థికవేత్త మాల్పాస్‌ (62)నే ఎంపిక చేశారు. ట్రంప్‌కు సీనియర్‌ ఆర్థిక సలహాదారుడిగా ఉన్న మాల్పాస్‌, 2016 ఎన్నికల ప్రచారంలో ఆయనతో కలిసి పనిచేశారు. ప్రపంచ బ్యాక్‌ గ్రూప్‌ డైరెక్టర్లు ఆమోదం తెలిపినట్లుయితే మాల్పాస్‌.. ప్రస్తుత వరల్డ్‌ బ్యాంక్‌ ప్రెసిడెంట్‌ జిమ్‌యాంగ్‌ కిమ్‌ స్థానంలో రానున్నారు. ప్రస్తుతం మాల్పా అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌లో అంతర్జాతీయ వ్యవహారాలకు కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.